January 2011
తెలుగు కళా సమితి - ఆపన్న హస్తం
రంప సౌద అనే మహిళ (Passport No. E8195492) భీమవరం నుండి కువైట్ వచ్చి ఒక కువైటి ఇంట్లో పనిమనిషి గా చేస్తూ జీవనం సాగిస్తోంది. దురదృష్టవశాత్తు ఆమె ఆరునెలల క్రితం కేన్సర్ బారిన పడి సభా హాస్పిటల్ – కేన్సర్ సెంటర్ లో treatment తీసుకుంటోంది.
అయితే మన తెలుగు కళా సమితి Welfare Wing ద్వారా చేస్తున్న సేవలు ఆమెకు తెలిసి ఆమె మన సహాయం కోరటం జరిగినది. వెంటనే మన Welfare Wing ఆమెను సందర్శించి, పూర్తి వివరాలు సేకరించి ఆమెకు తగిన సహాయం చేయటం జరిగినది.
1. Indian Embassy వారితో మాట్లాడి ఆమెను ఇండియా పంపటానికి కావలసిన Ticket ను ఏర్పాటు చేయటం జరిగినది.
2. అలాగే ఇండియా లో చికిత్స నిమిత్తం రూపాయలు 45,000/- Indian Embassy ద్వార ఏర్పాటు చేయటం జరిగినది.
3. ఆమె దారి ఖర్చుల నిమిత్తం రూపాయలు 3,000/- Indian Embassy ద్వార ఏర్పాటు చేయటం జరిగినది.
4. తెలుగు కళా సమితి Welfare Fund నుండి రూపాయలు 10,000/- సహాయం చేయటం జరిగినది.